సుందరయ్యకు నివాళి

ABN , First Publish Date - 2021-05-20T05:54:57+05:30 IST

పట్టణంలోని జ్యోతిబసు భవన్‌లో సీపీఎం ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సుందరయ్యకు నివాళి

హొళగుంద, మే 19: కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్యకు సీపీఎం మండల కార్యదర్శి వెంకటేశ్‌ నేతృత్వంలో పార్టీ కార్యాలయంలో బుధవారం నివాళులు అర్పించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ నాయకుడు నాగరాజు, హమాలీ సంఘం నాయకులు కట్టప్ప, రాముడు, హుసేని పాల్గొన్నారు.


ఆలూరు రూరల్‌: పట్టణంలోని జ్యోతిబసు భవన్‌లో సీపీఎం ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సుందరయ్య పోరాడారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి షాకీర్‌, ఆవాజ్‌ మండల అధ్యక్షుడు ఎస్‌ఎస్‌ బాషా, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రాజు, మహిళా సంఘం నాయకులు రత్నమ్మ, సీపీఎం నాయకుడు ఈశ్వర్‌గౌడ్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకుడు మైన, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు గోవర్ధన్‌, పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎల్లప్ప, సందీప్‌ పాల్గొన్నారు. 


కోసిగి: సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులు వీరేష్‌, సిద్దప్ప, మల్లికార్జున, శ్రీనివాసులు ప్రసంగించారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు సుందరయ్య అనికొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు రాజు, లక్ష్మన్న, గోపాల్‌, వీరన్న, తదితరులు పాల్గొన్నారు.


ఎమ్మిగనూరు: ప్రజానాయకుడు పుచ్చలపల్లి సందరయ్య త్యాగాలు మరువలేనివని సీపీఎం నాయకులు హనుమంతు అన్నారు. పార్టీ కార్యలయంలో సుందరయ్య వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు రాముడు, అంబేడ్కర్‌, లక్ష్మీనరసయ్య, ఖాజ, వసంతరాజు, రంగస్వామి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-20T05:54:57+05:30 IST