‘దళిత, గిరిజనులకు రక్షణ కల్పించాలి’

ABN , First Publish Date - 2021-08-21T05:09:10+05:30 IST

దళితులు, గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే అని రాయలసీమ జిల్లాల కన్వీనర్‌ కత్తి సుబ్బయ్య శుక్రవారం డిమాండ్‌ చేశారు.

‘దళిత, గిరిజనులకు రక్షణ కల్పించాలి’


కోవెలకుంట్ల, ఆగస్టు 20: దళితులు, గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే అని రాయలసీమ జిల్లాల కన్వీనర్‌ కత్తి సుబ్బయ్య శుక్రవారం డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి రోజూ దళితులపై దాడులు, దళిత మహిళలు, యువతులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రమ్యశ్రీని అనే యువతిని  నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపిన నిందితుడిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిష్పక్షపాతంగా పోలీసులు అమలు చేసి దళితులకు న్యాయం చేయాలని కోరారు. 


Updated Date - 2021-08-21T05:09:10+05:30 IST