‘ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలి’
ABN , First Publish Date - 2021-05-21T05:28:49+05:30 IST
కరోనా సెకెండ్ వేవ్ కేసులు ఉఽధృతమైన నేపథ్యంలో జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ తీవ్రమైందని, దాన్ని అడ్డుకోవాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య డివిజన్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ డిమాండ్ చేశారు.

నంద్యాల, మే 20: కరోనా సెకెండ్ వేవ్ కేసులు ఉఽధృతమైన నేపథ్యంలో జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ తీవ్రమైందని, దాన్ని అడ్డుకోవాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య డివిజన్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ డిమాండ్ చేశారు. గురువారం కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 28 ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా చికిత్సలు చేస్తున్నారని, అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల విధానాన్ని అమలు చేయడం లేదని అన్నారు. పైవేటు ఆసుపత్రులు రూ.50 వేల నుంచి రూ. లక్ష దాకా డిపాజిట్ చేస్తేనే బెడ్ కేటాయిస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనాకు వైద్యం చేయిస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు అమలులోకి రాలేదని అన్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకొని కొవిడ్ బాధితులకు ఉచిత చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి నబీరసూల్, ఉపాధ్యక్షుడు మౌలీసా, సహాయ కార్యదర్శి అబ్దుల్ సలాం పాల్గొన్నారు.