బంగారు ఆభరణాల బహూకరణ

ABN , First Publish Date - 2021-10-26T05:04:15+05:30 IST

మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి మహాలక్ష్మి అమ్మవార్లకు ఓ భక్తుడు రూ.7.50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను ఏవో పాండురంగారెడ్డి, చైర్మన్‌ లక్ష్మీరెడ్డికి సోమవారం అందజేశారు.

బంగారు ఆభరణాల బహూకరణ
బంగారు ఆభరణాలను అందజేస్తున్న భక్తుడు

బేతంచెర్ల, అక్టోబరు 25: మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి మహాలక్ష్మి అమ్మవార్లకు ఓ భక్తుడు రూ.7.50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను ఏవో పాండురంగారెడ్డి, చైర్మన్‌ లక్ష్మీరెడ్డికి సోమవారం అందజేశారు. కర్నూలు నగరానికి చెందిన రామకృష్ణారెడ్డి కుమారుడు పెసలదిన్నె  కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ బంగారు ఆభరణాలను అందజేశారని ఆలయ ఈవో పాండురంగారెడ్డి తెలిపారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి దంపతులను పట్టు వస్త్రాలతో సన్మానించారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి, కుటుంబ సభ్యులు, ఆలయ ధర్మకర్త ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T05:04:15+05:30 IST