ఆలయాల్లో డీఎస్పీలు

ABN , First Publish Date - 2021-01-13T05:57:10+05:30 IST

బనగానపల్లె మండలంలోని యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయాన్ని డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి, సీఐ సురేశ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ మహేశ్‌కుమార్‌ మంగళవారం పరిశీలించారు.

ఆలయాల్లో డీఎస్పీలు

బనగానపల్లె, జనవరి 12: బనగానపల్లె మండలంలోని యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయాన్ని డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి, సీఐ సురేశ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ మహేశ్‌కుమార్‌ మంగళవారం పరిశీలించారు. ఆలయాలపై దాడుల నేపథ్యంలో యాగంటి క్షేత్ర భద్రతపై ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, ఆలయ పూజారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


‘దేవాలయాలపై ప్రత్యేక నిఘా’


రుద్రవరం: ఆళ్లగడ్డ సబ్‌ డివిజన్‌లోని దేవాలయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆళ్లగడ్డ డీఎస్పీ రాజేంద్ర అన్నారు. మంగళవారం సాయంత్రం రుద్రవరం సమీపంలో ఉన్న గుట్టకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని పరిశీలించారు. దేవాలయ నిర్వాహకుడు నల్లగట్ల సత్యనారాయణతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ చర్చిలు, మసీదులు, దేవాలయాల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. నల్లమల సరిహద్దుల్లోని ప్రతి దేవాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేవదాయశాఖ అధికారులకు కూడా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. గ్రామాల్లో రక్షణ దళాలతో దేవాలయాలు, మసీదులు, చర్చిలు పర్యవేక్షణ చేయిస్తామని అన్నారు. ఆయన వెంట శిరివెళ్ల సీఐ చంద్రబాబునాయుడు, ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి, ఏఎస్‌ఐ శోభన్‌బాబు ఉన్నారు. 

Updated Date - 2021-01-13T05:57:10+05:30 IST