పెట్రో ధరలు తగ్గించాల్సిందే

ABN , First Publish Date - 2021-11-10T05:28:30+05:30 IST

పెట్రో ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ, నాయకులు కార్యకర్తలు మంగళవారం పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

పెట్రో ధరలు తగ్గించాల్సిందే
ఆలూరులో నిరసన తెలుపుతున్న టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ

  1. టీడీపీ నాయకులు, కార్యకర్తల ర్యాలీలు, ధర్నాలు
  2. పెట్రోల్‌ బంకుల వద్ద బైఠాయించి నిరసన
  3. ప్రభుత్వ తీరుపై మండిపాటు


పెట్రో ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ, నాయకులు కార్యకర్తలు మంగళవారం పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలు, ర్యాలీలు, బైఠాయింపులతో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇప్పటికైనా పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను తగ్గించకపోతే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


ఆలూరు, నవంబరు 9: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించే వరకు పోరాటం ఆగదని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు. మంగళవారం ఆలూరు పట్టణంలో టీడీపీ నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించి బళ్లారి రోడ్డులో ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలుగు రైతు కమిటీ రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి, ఆలూరు, మొలగవల్లి, మరకట్టు, ఎం.కొట్టాల గ్రామ సర్పంచ్‌లు అరుణదేవి, మోహన్‌రాజ్‌, ఎల్లప్ప, రాజశేఖర్‌, మాజీ జడ్పీటీసీ మీనాక్షినాయుడు, మండల కన్వీనర్లు అశోక్‌, పరమారెడ్డి, విజయభాస్కర్‌గౌడ్‌, వలీ, జిల్లా నాయకులు రఘుప్రసాద్‌రెడ్డి, పాల్‌రెడ్డి, నరసప్ప, కొమ్మురా మాంజి, నాగరాజు, సురేంద్ర పాల్గొన్నారు.


ఆదోని: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి సాయిబాబా గుడి సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌ దగ్గర తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు భాస్కర్‌రెడ్డి, దేవేంద్రప్ప, బుద్దారెడ్డి, రంగస్వామి నాయుడు మాట్లాడారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఆంధ్ర కంటే రూ.10 తక్కువగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పెద్దహరివాణం శేషిరెడ్డి, అయ్యన్న, తిమ్మప్ప, కృష్ణారెడ్డి, కల్లుబావి మల్లికార్జున, ప్రతాప్‌రెడ్డి, ఆరేకల్లు రామకృష్ణ, లక్ష్మీనారాయణ, నల్లన్న, నాగరాజు, కన్నాయాదవ్‌, వీరారెడ్డి, అలసందగుత్తి రవి, సోము పాల్గొన్నారు. 


ఎమ్మిగనూరు: పెట్రోల్‌, డీజిల్‌పై పెంచిన పన్నులను తగ్గించాలని కోరుతూ టీడీపీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి ఎంజీ పెట్రోల్‌ బంకు వరకు ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్‌ బంకు దగ్గర బైటాయించి పన్నులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఆందోళన విరమించాలని చెప్పడంతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఎమ్మినూరు, నందవరం నాయకులు రామలింగారెడ్డి, మాజీ ఎంపీపీ వాల్మీకి శంకరయ్య, దేశాయ్‌ మాధవరావు, ఈరన్నగౌడ్‌, సుందరరాజు, కేఎండీ ఫారుక్‌, మల్లికార్జున మాట్లాడారు. పన్నులు తగ్గించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కొండయ్య చౌదరి, ముల్లాకలీముల్లా, సోమేశ్వరరెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, చంద్ర, మధుబాబు, రంగస్వామిగౌడ్‌, కటారి రాజేంద్ర, చేనేతమల్లి, సురేంద్రరెడ్డి,గౌస్‌, దేవధాస్‌, శంకర్‌గౌడ్‌, అంజి, దేవేంద్ర, జయన్న, పెద్దరంగన్న, రామకృష్ణ, గంగన్న, తిమ్మాపురం రంగన్న, గిడ్డయ్య, భీమా పాల్గొన్నారు. 


మంత్రాలయం: ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం టీడీపీ పిలుపు మేరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంత్రాలయంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి పెట్రోల్‌ బంకు ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించి ప్రజలపై కొంత భారం తగ్గిస్తే జగన్‌ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించకపోవటం సిగ్గుచేటన్నారు. ధరలు తగ్గాలంటే జగన్‌ దిగిపోవాలని అన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి నాగసేన స్వామి, జిల్లా అధికార ప్రతినిధి చావడి వెంకటేష్‌, వగరూరు రామిరెడ్డి, కేశన్న, అబ్దుల్లా, చంద్ర, ఆచారి, భీమన్న, రాజు, హనుమంతు, వీరేష్‌, నరసింహులు పాల్గొన్నారు.


కౌతాళం: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అదనపు పన్నుల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చన్న బసప్ప, వెంకటపతిరాజు, అడివప్పగౌడ్‌ అన్నారు. మంగళవారం టీడీపీ నాయకులు ధర్నాకు రాకుండా పోలీసులు అడ్డుపడ్డారు. గోతులదొడ్డి గ్రామంలోని ఉలిగయ్య, చెన్నబసప్పను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీ కార్యాలయం నుంచి ఆదోని రహదారికి గల భారత్‌ పెట్రోల్‌ బంకు వద్ద బాపురం రోడ్డులోని ఇండియన్‌ పెట్రోల్‌ బంకు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సుధీర్‌రెడ్డి, రామలింగ, కురువ వీరేష్‌, టిప్పు సుల్తాన్‌, మంజు, రాజానంద్‌, శివమూర్తి, రాజబాబు, సునీల్‌, రెహమాన్‌, గొట్టయ్య, శ్రీరామ్‌, సిద్దు, కురుగోడు పాల్గొన్నారు.


దేవనకొండ: పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని టీడీపీ మండల కన్వీనర్‌ విజయభాస్కర్‌గౌడ్‌, మండల నాయకులు ఉచ్చీరప్ప, ఆకుల వీరేష్‌లు అన్నారు. మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం చారు. కార్యక్రమంలో రామారావునాయుడు, భాస్కర్‌, బండ్లయ్య, మాలిక్‌బా షా, డీలర్‌ బండ్లయ్య, రాజాసాహెబ్‌, మస్తాన్‌, సుభాన్‌, నాగరాజుగౌడ్‌, రాజశేఖర్‌గౌడ్‌, వెంకటేష్‌, వెంకటస్వామిగౌడ్‌, మహేశ్వరరెడ్డి, చిన్న రామప్ప, పెద్దయ్య, నాగేష్‌, వెంకటరెడ్డి, లతీఫ్‌, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. 


హొళగుంద: వైసీపీ ప్రభుత్వం ప్రజలను నిలువుదోపిడీకి గురిచేస్తోందని హొళగుంద టీడీపీ మండల కన్వీనర్‌ వీరన్నగౌడ్‌, సీపీఐ మండల సహాయ కార్యదర్శి రంగన్న అన్నారు. మంగళవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక బస్టాండు నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించి పెట్రోల్‌ బంక్‌ వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో కోగిలతోట రంగప్ప, సిద్ధప్ప, తిక్కస్వామి, మల్లి, రవి పాల్గొన్నారు.


ఆస్పరి: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని స్థానిక పెట్రోల్‌ బంక్‌ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ పరమారెడ్డి, కృష్ణయాదవ్‌, మాజీ ఎంపీపీ బిల్లేకల్‌ వెంకటేష్‌, తిమ్మన్న, ముత్యాలరెడ్డి, సుదర్శన్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఉచ్చీరప్ప, చంద్ర, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు సతీష్‌ పాల్గొన్నారు.


గోనెగండ్ల: సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ గోనెగండ్ల టీడీపీ నాయకులు మంగళవారం సంత మార్కెట్‌లోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని కోరుతూ గంజహళ్లి బడసా స్వామి పెట్రోల్‌ షాప్‌ దగ్గర ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్‌ నజీర్‌సాహెబ్‌, తిరుపతయ్య నాయుడు, మాజీ వైస్‌ ఎంపీపీ బుడ్డప్ప, కౌలుట్లయ్య నాయుడు, దరగలమాబు, మిన్నల్ల, నాగరాజు, అక్బర్‌, టీపీపీ టౌన్‌ అధ్యక్షుడు రమేష్‌నాయుడు పాల్గొన్నారు. 


కోసిగి: రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాలంటే ముఖ్యమంత్రి జగన్‌ దిగిపోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని కోరుతూ మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి ఆదేశాల మేరకు కోసిగిలోని స్థానిక స్టేట్‌ బ్యాంకు నుంచి ఇండియన్‌ పెట్రోల్‌ బంకు వరకు టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. వాల్మీకి సర్కిల్‌లో నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముత్తురెడ్డి, నాడిగేని అయ్యన్న, పల్లెపాడు రామిరెడ్డి, జ్ఞానేష్‌, నరసారెడ్డి, చిరుకతాయన్న, కొండగేని వీరారెడ్డి, కృష్ణారెడ్డి, బోంపల్లి నరసింహులు, వీరయ్య, బానుప్రకాష్‌, రాము, ఉమర్‌ సొట్టయ్య, గాలంవీరేష్‌, రణతిక్కన, ప్రభాకర్‌గౌడు, టీడీపీ కార్యకర్తలు, నాయకులుఉన్నారు.

Updated Date - 2021-11-10T05:28:30+05:30 IST