‘పెట్రో, డీజిల్ ధరలు తగ్గించాలి’
ABN , First Publish Date - 2021-08-26T05:07:20+05:30 IST
పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు.

ఎమ్మిగనూరు, ఆగస్టు 25: పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ నాయకుడు జేమ్స్ మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఆటో కార్మికుల జీవనం ఇబ్బందిగా మారిందన్నారు. ఇది కాదని ఆటోలపై అధికారులు దాడులు నిర్వహిస్తూ పాసింగ్ పేరిట ఏడాదికి రూ.3 వేలు వసూలు చేయటం దారుణమన్నారు. అనంతరం డీటీకి వినతిపత్రం సమర్పించారు.