పింఛన్‌ పోరు

ABN , First Publish Date - 2021-09-04T04:48:17+05:30 IST

వృద్ధాప్య, వితంతు పింఛన్ల తొలగింపుపై టీడీపీ శ్రేణులు శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

పింఛన్‌ పోరు
కోసిగిలో వినతి పత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

  1. ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ నాయకుల మండిపాటు
  2. తొలగించిన వాటిని పునరుద్ధరించాలని డిమాండ్‌


వృద్ధాప్య, వితంతు పింఛన్ల తొలగింపుపై టీడీపీ శ్రేణులు శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నిబంధనల సాకుతో పింఛన్లు తొలగించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఏటా పింఛన్‌ పెంచుకుంటూ పోతామని చెప్పి ఉన్న వాటిని తొలగించడం ఏంటని ప్రశ్నించారు. అధికారులకు వినతి పత్రాలు సమర్పించి అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు.


ఆలూరు, సెప్టెంబరు 3: వృద్ధులు, వితంతు, వికలాంగుల పింఛన్ల తొలగింపు అన్యాయమని తెలుగు రైతు కమిటీ రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు పింఛన్ల తొలగింపుపై ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ మండల కన్వీనర్‌ రాంభీంనాయుడు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆలూరు మండలంలో తొలగించిన 200 పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎంపీడీవో అల్లాబకాష్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అరుణదేవి, జిల్లా నాయకులు నరసప్ప, కొమ్ము రామాంజి, నాగరాజు, నారాయణ, అనిల్‌, ముద్దురంగ, గూళ్యం రామాంజి, విష్ణుశేకర్‌, జిలాని, మసాల జగన్‌, ఉచ్చీరప్ప, ఈరన్న పాల్గొన్నారు. 


ఎంపీడీవో కార్యాలయం వద్ద మాజీ ఎంపీపీ కృష్ణయాదవ్‌, టీడీపీ సీనియర్‌ నాయకులు రామచంద్రరెడ్డి, తిమ్మన్న, సుదర్శన్‌, టీఎన్‌ఎఫ్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కె.సతీష్‌కుమార్‌లు నిరసన తెలిపారు. వృద్ధులు, వితంతువుల పింఛన్లను తొలగించడం అన్యాయమన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో శ్రీనివాసులుగౌడ్‌, ముత్యాలరెడ్డి, శేషాద్రి, నరసప్ప, రాజ్‌కుమార్‌, యాటకల్‌ గిరి, వీరభద్రి, రంగస్వామి, శీను, సోమనాథ్‌, రాముడు, శంకరబండ నాగేంద్ర, రాఘవేంద్ర పాల్గొన్నారు. 


ఆదోని: పింఛన్ల అడ్డగోలు తొలిగింపును ఆపాలని టీడీపీ నాయకులు తిమ్మప్ప, మల్లన్న, వెంకటేష్‌, సుబ్బు అన్నారు. శుక్రవారం పింఛన్లు తొలగింపుపై మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక ఇంట్లో ఒకరికే పింఛన్‌, ఏ నెల పింఛన్‌ ఆ నెల అనే నిర్ణయాలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలని కోరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక నెల తీసుకోకపోయినా రెండు నెలలకు సంబంధించిన పింఛన్‌ అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు నల్లన్న, కౌన్సిలర్‌ భర్త వెంకటేష్‌, సుబ్బు, మల్లికార్జున, శ్రీరాములు, మాజీ కౌన్సిలర్‌ తిమ్మప్ప, మహమ్మద్‌ పాల్గొన్నారు.


ఆదోని రూరల్‌: నిబంధనల సాకుతో పింఛన్లు తొలగించవద్దని టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్డడించారు. ప్రస్తుతం వస్తున్న పింఛన్లు తొలగించకుండా అర్హులందరికీ కొత్త పింఛన్లు ఇవ్వాలని టీడీపీ జిల్లా నాయకుడు నల్లన్న, మాజీ ఎంపీటీసీ దొడ్డనగేరి శివప్ప, దిబ్బనకల్లు సర్పంచ్‌ లక్ష్మణ, గణేకల్‌ విరుపాక్షి డిమాండ్‌ చేశారు. ప్రతి ఏడాది పింఛన్‌ పెంచుతూ పోతామని చెప్పి ఉన్న వాటిని తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఏవో శేఖర్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బాలస్వామి, బంగారయ్య, లింగన్న పాల్గొన్నారు. 


హొళగుంద: అనాలోచిత నిర్ణయాలతో సీఎం జగన్‌ వృద్ధులకు అన్యాయం చేయడం తగదని టీడీపీ మండల కన్వీనర్‌ తిప్పయ్య శుక్రవారం అన్నారు. ఎంపీడీవో కార్యాలయం ముందు మాట్లాడుతూ తొలగించిన పింఛన్లు తిరిగి ఇవ్వాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంపీడీవో దాసరి మేరికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పీరన్న, వెంకటేష్‌, మల్లికార్జున, గాదిలింగ, లక్ష్మన్న, కట్టే మారెప్ప, షేక్షావలీ పాల్గొన్నారు.


పెద్దకడబూరు: పింఛన్ల తొలగింపు దుర్మార్గపు చర్య అని టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధికార ప్రతినిధి రమాకాంత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దకడబూరులోని ఎంపీడీవో నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మధుసూదన్‌రెడ్డి, మల్లికార్జున, ఏసేపు, మీసేవ ఆంజనేయ, బొగ్గుల నరసన్న, తలారి అంజి, లక్ష్మన్న, బాబు, రాము, హనుమంతు పాల్గొన్నారు.


దేవనకొండ: ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి విధించిన కాలపరిమితిని ఎత్తేయాలని టీడీపీ మండల కన్వీనర్‌ విజయభాస్కర్‌గౌడ్‌, జడ్పీటీసీ అభ్యర్థి బడిగింజల రంగన్న, ఉచ్చీరప్ప, మలకన్న, మల్లికార్జునగౌడ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ నెల పింఛన్‌ ఆ నెలలోనే తీసుకోవాలని నిబంధన విధించడం మంచిది కాదన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి రూ.3వేల పింఛన్‌ ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. అనంతరం సూపరింటెండెంట్‌ మహబూబ్‌బాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామారావునాయుడు, మల్లయ్య, వీరేష్‌, వెంకటస్వామిగౌడ్‌, పురుషోత్తంగౌడ్‌, వెంకటేష్‌, రాజాసాహెబ్‌, రాజశేఖర్‌గౌడ్‌, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.


ఎమ్మిగనూరు: వృద్ధాప్య, వితంతువు, దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై టీడీపీ నాయకులు శుక్రవారం ఎమ్మిగనూరు ఎంపీడీవో కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో బంగారమ్మకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మల్లికార్జున, కేశన్న, డీలర్‌ ఈరన్న, కొండన్న గౌడ్‌, రంగన్న, మురళి, సురేష్‌ చౌదరి మాట్లాడారు. తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.


గోనెగండ్ల: నిబంధనల పేరుతో పింఛన్లు తొలగించడం అన్యాయమని గోనెగండ్ల మండల టీడీపీ నాయకులు నజీర్‌ సాహెబ్‌, తిరుపతయ్య నాయుడు, దరగల మాబు, రమేష్‌నాయుడు, రామాంజినేయులు, బేతళబడేసా అన్నారు. శుక్రవారం గోనెగండ్లలో టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఎంపీడీవో కార్యాలయం వరకు సాగింది. కొంత సేపు ధర్నా నిర్వహించి ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రమేష్‌నాయుడు, కులుమాల రాముడు, నూరహమ్మద్‌, పెద్దనేలటూరు ఎర్రన్న, చెన్నల రాయుడు, మిన్నల్ల, ఎస్‌ఎన్‌ మాబువలి, మునిస్వామి, రంజాన్‌, రఫీక్‌, వంశీ, రంగస్వామి, పాల్గన్నారు. 


కోసిగి: పింఛన్ల తొలగింపు దారుణమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కోసిగిలో ఎంపీడీవో కార్యాలయం ముందు టీడీపీ ఆధ్వర్యంలో పింఛన్ల రద్దుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సూపరింటెండెంట్‌ రమాదేవికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, నాడిగేని అయ్యన్న, జ్ఞానేష్‌, చింతలగేని నర్సారెడ్డి, నాగేష్‌, చిరుక తాయన్న, పంపాపతి, హోటల్‌ వీరేష్‌, తాయన్న, వీరారెడ్డి, రంగన్న, ప్రభాకర్‌ రెడ్డి, రాము, రణతిక్కన, సల్మాన్‌ రాజు ఉన్నారు.


హాలహర్వి: పింఛన్లు తొలగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ప్రజలే గుణపాఠం చెబుతారని టీడీపీ మండల నాయకులు ప్రహ్లాదరెడ్డి, బసిరెడ్డి అన్నారు. శుక్రవారం అర్హులైన పింఛన్ల తొలగింపుపై ఎంపీడీవో కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మారుతి, వీరేష్‌, ఎల్లప్ప పాల్గొన్నారు.

Updated Date - 2021-09-04T04:48:17+05:30 IST