‘ఓర్వకల్లును కరువు మండలంగా ప్రకటించాలి’

ABN , First Publish Date - 2021-08-28T05:11:18+05:30 IST

ఓర్వకల్లును కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ రెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణ డిమాండ్‌ చేశారు.

‘ఓర్వకల్లును కరువు మండలంగా ప్రకటించాలి’

ఓర్వకల్లు, ఆగస్టు 27: ఓర్వకల్లును కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ రెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో వాడుముఖం పట్టిన మొక్కజొన్న పంటలను బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ రెడ్డి, రామకృష్ణ మాట్లాడుతూ ఈ ఏడాది తగినంత వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతే రాజు అంటూ చెబుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నడ్డీ విరిచే విదంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. తక్షణమే అధికారులు స్పం దించి రైతుల పొలాలను పరిశీలించి, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు నాగన్న, శ్రీధర్‌, షాజహాన్‌, మధుసూదన్‌, వెంకటేశ్వర్లు, రంగస్వామి, మాసూంబాషా, రైతులు పాల్గొన్నారు. Updated Date - 2021-08-28T05:11:18+05:30 IST