‘శుభకార్యాలకు 150 మందికే అనుమతి’

ABN , First Publish Date - 2021-08-22T05:21:04+05:30 IST

కొవిడ్‌ నియంత్రణలో భాగంగా వివాహాలు, ఇతర శుభకార్యాలు, మతపరమైన సమావేశాలు ఏదైనా సరే గరిష్ఠంగా 150 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని,

‘శుభకార్యాలకు 150 మందికే అనుమతి’

కర్నూలు(కలెక్టరేట్‌), ఆగస్టు 21: కొవిడ్‌ నియంత్రణలో భాగంగా వివాహాలు, ఇతర శుభకార్యాలు, మతపరమైన సమావేశాలు ఏదైనా సరే గరిష్ఠంగా 150 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. శుభకారాల్లో 150 మందికి మించి గుమి కూడకుండా పోలీసు, రెవెన్యూ అధికారులు గట్టిగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు విధిగా పాటించేలా చూడాలన్నారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని, శానిటైజ్‌ చేసుకునేలా చూడాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కాని, ఫంక్షన్‌ హాల్లో కానీ ఫిక్స్‌డ్‌ సీట్లు అయితే సీట్‌ మార్చి సీటులో  కూర్చునేలా చూడాలన్నారు. ఫిక్స్‌డ్‌ సీటింగ్‌ లేనిచోట ఐదు అడుగుల దూరం ఉండేలా సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ కోరారు.

Updated Date - 2021-08-22T05:21:04+05:30 IST