ఉల్లి పంట పరిశీలన

ABN , First Publish Date - 2021-12-08T05:45:24+05:30 IST

ఉల్లికి వచ్చే తెగుళ్ల నివారణకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఉద్యానవన శాఖ అధికారి ఇందిర అన్నారు.

ఉల్లి పంట పరిశీలన


గోనెగండ్ల, డిసెంబరు 7: ఉల్లికి వచ్చే తెగుళ్ల నివారణకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఉద్యానవన శాఖ అధికారి ఇందిర అన్నారు. గోనెగండ్లలో తెగుళ్లు సోకిన ఉల్లి పంటను మంగళవారం ఆమె పరిశీలించారు.  నివారణకు లీటర్‌ నీటిలో హెక్సాకోనాజోల్‌ ఒక మి.లీ. కలిపి పిచికారీ చేయాలని సూచించార. లేదంటే క్లోరోఽథలోనిల్‌ 2 గ్రాములు, హైరాకోస్టోబిన 2 గ్రాములు లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పిచికారీ చేసేముందు సబ్బునీరు, లేక సర్ఫ్‌ నీరు, శాండోవిట్‌ లాంటి ద్రవంను కలపాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ ఉద్యాన వన సహాయకురాలు చైతన్యలక్ష్మి, మహేంద్ర, రైతులు పొల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T05:45:24+05:30 IST