కొనసాగుతున్న కార్తీక మాసోత్సవాలు

ABN , First Publish Date - 2021-11-10T04:26:45+05:30 IST

శ్రీశైలం మహక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న కార్తీక మాసోత్సవాలు


శ్రీశైలం, నవంబరు 9: శ్రీశైలం మహక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీకమాసం మంగళవారం పురస్కరించుకొని భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం నుంచే భక్తులు ఆలయ ఉత్తర మాఢవీధిలో, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద దీపారాధనలను చేశారు. సాయంత్రం ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం కార్యక్రమాన్ని నిర్వహించారు.  

 -  శ్రీశైల క్షేత్రంలో మంగళవారం ఆలయ పాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్య (కుమారస్వామి) స్వామికి, బయలు వీరభద్ర స్వామి, నందీశ్వరుడికి విశేష అభిషేకం, అర్చనలు చేశారు. ముందుగా పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి స్వామికి పూజలు చేశారు.  

  శ్రీశైలంలో సాంస్కృతిక కార్యక్రమాలు

 శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా మంగళవారం బీవీఎన నంద్యాల వారిచే గాత్ర కచేరి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మహగణపతిం, శివ శివ అనరాదా, భో శంభో, లింగాష్టకం, అష్టలక్ష్మీ స్త్రోత్రం, గరుడగమన, శివపంచాక్షరీ, తదితర గీతాలకు శ్రావ్య, సుస్మిత, అక్షిత, లిఖిత తదితరులు గీతాలను ఆలపించారు. అలాగే కళారాధన మ్యూజిక్‌ లండ్‌ డాన్స అకాడమీ విశాఖపట్నం వారచే సాంప్రదాయ నృత్య ప్రదర్శన కర్యక్రమాన్ని నిర్వహించారు.  


Updated Date - 2021-11-10T04:26:45+05:30 IST