బైకుపై వెళ్తుండగా..

ABN , First Publish Date - 2021-02-26T05:38:50+05:30 IST

ఆదోని మండలం నెట్టేకల్లు గ్రామానికి చెందిన తాయన్న (38) చిత్తూరు జిల్లా రేణుగుంట వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందగా, భార్య కాశెమ్మ తీవ్రంగా గాయపడ్డారు.

బైకుపై వెళ్తుండగా..

ఆదోని, ఫిబ్రవరి 25: ఆదోని మండలం నెట్టేకల్లు గ్రామానికి చెందిన తాయన్న (38) చిత్తూరు జిల్లా రేణుగుంట వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందగా, భార్య కాశెమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వివరాల మేరకు.. మృతుడు తిరుపతిలో తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు. ఇటీవల గ్రామంలోని పొలాన్ని అమ్మాడు.. ఇంకా కొంత డబ్బులు రావాల్సి ఉంటంతో వాటి కోసం స్వగ్రామానికి వచ్చాడు. గణేకల్లులో దేవరకు హాజరై గురువారం ఉదయాన్నే దంపతులు ఇద్దరు బైక్‌పై తిరుపతికి బయలుదేరారు. అయితే చిత్తూరు జిల్లా రేణుగుంట వంతెన వద్ద వీరి బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. తాయన్న మృతి చెందగా కాశెమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కాశెమ్మను తిరుపతి ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్‌ రామాంజనేయులు, బంధువులు హుటాహుటిన తిరుపతికి బయలుదేరి వెళ్లారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసినట్లు సర్పంచ్‌ తెలిపారు. 


Updated Date - 2021-02-26T05:38:50+05:30 IST