పిడుగుపాటుతో నష్టం

ABN , First Publish Date - 2021-05-22T05:23:39+05:30 IST

బేతంచెర్ల పట్టణంలో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ కురవడంతో పట్టణంలోని బేగరీపేటలో ఓ ఇంటి పైకప్పు గోడ పిడుగుపాటుతో పాక్షికంగా దెబ్బతింది.

పిడుగుపాటుతో నష్టం

బేతంచెర్ల, మే 21: బేతంచెర్ల పట్టణంలో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ కురవడంతో పట్టణంలోని బేగరీపేటలో ఓ ఇంటి పైకప్పు గోడ పిడుగుపాటుతో పాక్షికంగా దెబ్బతింది. దీంతో పాటు ఆ ఇంట్లో 5 ఫ్యాన్లు, టీవీ కాలిపోయాయి. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో మరో 6 టీవీలు, ఒక జిరాక్స్‌ మిషన్‌ కాలిపోయాయని వాపోయారు. రాత్రి సమయం కావడంతో ప్రజలు ఇళ్లల్లోనే ఉండడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రూ.లక్ష ఆస్తినష్టం జరిగిందని బాధితులు తెలిపారు. 


Updated Date - 2021-05-22T05:23:39+05:30 IST