స్నేహితుడికి ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2021-11-24T05:25:24+05:30 IST

వెలుర్తిలో 1989-1990 సంవత్సరం పదో తరగతి బ్యాచ్‌కు చెందిన ఎస్‌.నూర్‌ అహ్మద్‌ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

స్నేహితుడికి ఆర్థిక సాయం
ఆర్థిక సాయం అందజేస్తున్న స్నేహితులు

వెల్దుర్తి, నవంబరు 23: వెలుర్తిలో 1989-1990 సంవత్సరం పదో తరగతి బ్యాచ్‌కు చెందిన ఎస్‌.నూర్‌ అహ్మద్‌ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కర్నూలులోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నారు. చిన్ననాటి స్నేహితులు సుమారు 70 మంది రూ.1.50 లక్షలు పోగు చేశారు. ఈ మొత్తాన్ని ఆసుపత్రికి వెళ్లి స్నేహితుడు నూర్‌ అహ్మద్‌ భార్య సలీమ, తల్లి మాబున్నీకి అందజేశారు.

Updated Date - 2021-11-24T05:25:24+05:30 IST