బావిలో పడి వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2021-02-27T05:08:31+05:30 IST

ప్రమాదవ శాత్తు బావిలో పడి వృద్ధురాలు మృతిచెం దింది.

బావిలో పడి వృద్ధురాలి మృతి

గడివేముల, ఫిబ్రవరి 26: ప్రమాదవ శాత్తు బావిలో పడి వృద్ధురాలు మృతిచెం దింది. ఈ ఘటన మండలంలోని బిలకలగూ డురు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిలకలగూడురు గ్రామానికి చెందిన వీరమ్మ (64) ఉదయం 6 గంటలకు వెంకటరెడ్డి బావి వద్ద ఉన్న చింతచెట్టు వద్దకు చింతబోటు కోసం వెళ్లింది. చింత బోటు సేకరిస్తూ కాలు జారి అదుపు తప్పి బావిలో పడి మృతి చెందింది. వీరమ్మ కుమారుడు నాగశేషులు ఫిర్యా మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - 2021-02-27T05:08:31+05:30 IST