‘నోటిఫికేషన్లు జారీ చేయాలి’

ABN , First Publish Date - 2021-07-13T04:30:26+05:30 IST

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటనలను జారీ చేయాలని డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి హుస్సేన్‌బాషా, పీడీఎ్‌సయూ జిల్లా కార్యదర్శి రఫి, పీవైఎల్‌ జిల్లా నాయకుడు నవీన్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

‘నోటిఫికేషన్లు జారీ చేయాలి’


నంద్యాల (ఎడ్యుకేషన్‌), జూలై 12: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటనలను జారీ చేయాలని డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి హుస్సేన్‌బాషా, పీడీఎ్‌సయూ జిల్లా కార్యదర్శి రఫి, పీవైఎల్‌ జిల్లా నాయకుడు నవీన్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో విద్యార్థి సంఘం నాయకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా  జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి నిరుద్యోగులను దగా చేశారని  విమర్శించారు. కార్యక్రమంలో అజిత్‌, లక్ష్మణ్‌, శివ పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-13T04:30:26+05:30 IST