‘నోటిఫికేషన్‌ రద్దు చేయాలి’

ABN , First Publish Date - 2021-08-22T05:18:09+05:30 IST

ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ నియామకాల నుంచి వికలాంగులకు మినహాయింపు ఇస్తూ సాధికారత శాఖ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్‌వలి డిమాండ్‌ చేశారు.

‘నోటిఫికేషన్‌ రద్దు చేయాలి’

నంద్యాల(నూనెపల్లె), ఆగస్టు 21: ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ నియామకాల నుంచి వికలాంగులకు మినహాయింపు ఇస్తూ సాధికారత శాఖ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్‌వలి డిమాండ్‌ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్‌ 34 పేర్కొందని, ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఏకపక్షంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం సరికాదన్నారు. ఇండియన్‌ పోలీస్‌ సర్వీసెస్‌, ఇండియన్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పరిధిలోని అన్ని కేటగిరిల నుంచి వికలాంగులను మినహాయించాలన్న నిర్ణయం ఆమోదయోగ్యం కాదన్నారు. కార్యక్రమంలో జిలాని, నబిరసూల్‌, వీరభరతుడు, కిరణ్‌, మద్దిలేటి పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-22T05:18:09+05:30 IST