18 నామినేషన్ల తిరస్కరణ
ABN , First Publish Date - 2021-02-06T05:36:16+05:30 IST
కల్లూరు మండలంలో 18 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

కర్నూలు(కలెక్టరేట్) ఫిబ్రవరి 5: కల్లూరు మండలంలో 18 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. శుక్రవారం మండలంలో వచ్చిన 98 సర్పంచ్ నామినేషన్ల, 410 వార్డు సభ్యుల స్థానాలకు వచ్చిన నామినేషన్లను ఆర్వోలు పరిశీలించారు. ఇందులో అనర్హత కలిగిన 6 సర్పంచ్ నామినేషన్లను, 12 వార్డు సభ్యుల స్థానాలకు వచ్చిన నామినేషన్లను ఆర్వోలు తిరస్కరించారు. మండలంలో చెట్లమల్లాపురం, చిన్నటేకూరు, కె.మార్కాపురం, నాయకల్లు గ్రామపంచాయతీల్లో ఒక్కొక్కటి, తడకనపల్లెలో సర్పంచ్ స్థానాలకు వచ్చిన 2 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నాయకల్లు గ్రామపంచాయతీలో వార్డు సభ్యుల స్థానాలకు వచ్చిన 5 నామినేషన్లు, పుసులూరు గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుల స్థానాలకు 3 నామినేషన్లు, ఏ.గోకులపాడులో 2 వార్డు సభ్యుల నామినేషన్లు, కొంగనపాడు, ఉల్లిందకొండలో ఒకొక్కక్క నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
కర్నూలు(రూరల్): కర్నూలు మండలంలోని నందనపల్లెలో 9 వార్డు నామినేషన్ పత్రాలను వివిధ కారణాల వలన తొలగించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. గత మూడు రోజులుగా నందనపల్లె, పడిదెంపాడు, పసుపుల, నూతనపల్లె, సూదిరెడ్డిపల్లె, వెంకాయపల్లె, భూపాల్‌నగర్ నుంచి అభ్యర్థులు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నామినేషన్ పత్రాల పరిశీలన నిర్వహించారు. అందులో వార్డు స్థానాలకు సంబంధించిన 9 పత్రాలను రకరకాల తప్పులు దొర్లడంతో ఆ నామినేషన్లను తొలగించామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెప్పారు. నందనపల్లెలో 37 వార్డు నామినేషన్లకు గాను తొమ్మిది మాత్రమే రిజక్టు అయ్యాయన్నారు.
కోడుమూరు: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ స్థానానికి 7 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే 20 వార్డులకు గాను 98 మంది నామినేషన్లు వేశారు. అయితే శుక్రవారం అధికారులు నామినేషన్లను పరిశీలించి 1, 7, 20వ వార్డుకు వేసిన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాల వలన తిరస్కరించారు.
గూడూరు: మండలంలోని కె.నాగులాపురం, మునగాల, గూడూరులోని ఎంఆర్‌సీ కేంద్రంలో ఆర్వోలు నామినేషన్ పత్రాలను పరిశీలించారు. ఇం దులో 9 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌కు సంబంధించి 49 నామినేన్లలో జులకల్ గ్రామ పంచాయతీకి సంబంధించి రెండు నామినేషన్లను ఆర్వో తిరస్కరించినట్లు ఎంపీడీవో మాధవీలత తెలిపారు. అలాగే వార్డులకు సంబందించి మొత్తం 188కి గాను మునగాల-1, మల్లాపురం-1 నామినేషన్లను సరైన పత్రాలు సమర్పించకపోవడంతో ఆర్వో తిరస్కరించారన్నారు.