నో మాస్క్.. నో సేల్
ABN , First Publish Date - 2021-07-08T05:39:41+05:30 IST
మాస్క్ లేనిదే విక్రయాలు జరపవద్దని ఎంపీడీవో గీతావాని అన్నారు. నో మాస్క్ నో సేల్ కార్యక్రమంలో భాగంగా బుధవారం విరుపాపురంలో దుకాణదారులకు మాస్క్‌పై అవగాహన కల్పిస్తూ సచివాలయ సిబ్బందితో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

ఆదోని రూరల్, జూలై 7: మాస్క్ లేనిదే విక్రయాలు జరపవద్దని ఎంపీడీవో గీతావాని అన్నారు. నో మాస్క్ నో సేల్ కార్యక్రమంలో భాగంగా బుధవారం విరుపాపురంలో దుకాణదారులకు మాస్క్‌పై అవగాహన కల్పిస్తూ సచివాలయ సిబ్బందితో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మాస్క్ లేనిదే బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. సమావేశంలో సర్పంచ్ ప్రహ్లాద, ఈవోపీఆర్‌డీ జనార్దన్, తాలుకా ఎస్‌ఐ నాగేంద్రకుమార్‌రెడ్డి, సెక్రటరీ వేణుగోపాల్‌రెడ్డి, మురళి పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు: కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని మున్సిపల్ డీఈ మెంకటేశ్వర్లు, మెప్మా పీవో మోహన్ అన్నారు. బుధవారం ప్రభు త్వ ఆదేశాల మేరకు పట్టణ ంలో మెప్మా ఆధ్వర్యంలో నోమాస్క్ నో.. సేల్ అనే నినాదంతో ర్యాలీ నిర్వహిం చారు.