తిమ్మాపురంలో హత్య

ABN , First Publish Date - 2021-12-30T05:36:19+05:30 IST

మండల పరిధిలోని తిమ్మాపురంలో రాఘవేంద్ర అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం హత్య చేశారు.

తిమ్మాపురంలో హత్య

కౌతాళం, డిసెంబరు 29: మండల పరిధిలోని తిమ్మాపురంలో రాఘవేంద్ర అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం హత్య చేశారు. ఎస్‌ఐ మన్మథ విజయ్‌ తెలిపిన వివరాల మేరకు చెన్నాపురం గ్రామానికి చెందిన రాఘవేంద్ర(45) మూడేళ్లనుంచి తిమ్మాపురంలో ఉంటున్నాడు. మద్యానికి బానిసై గ్రామంలో అల్లర్లకు పాల్పడేవాడు. ఈ కారణంగానే హత్య జరిగి ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Updated Date - 2021-12-30T05:36:19+05:30 IST