రూ.17.20 లక్షలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-02-06T05:00:38+05:30 IST

దేవనకొండ క్రాస్‌ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలో రూ.17.20లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ప్లైయింగ్‌స్వ్కాడ్‌ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్‌ విష్ణుప్రసాద్‌, ఎస్‌ఐ నరసింహులు శుక్రవారం తెలిపారు.

రూ.17.20 లక్షలు  స్వాధీనం

దేవనకొండ, పిబ్రవరి 5: దేవనకొండ క్రాస్‌ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలో రూ.17.20లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ప్లైయింగ్‌స్వ్కాడ్‌ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్‌ విష్ణుప్రసాద్‌, ఎస్‌ఐ నరసింహులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబ్దుల్‌మున్నాఫ్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌ నుంచి బళ్లారికి ఓ కారులో ఆ డబ్బులను తరలిస్తుండగా వాహనాల తనిఖీలో భాగంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో సీజ్‌చేసి పంచనామా చేసిన అనంతరం జిల్లా ట్రెజరీ కార్యాలయంలో డిపాజిట్‌ చేసినట్లు తెలిపారు.


Updated Date - 2021-02-06T05:00:38+05:30 IST