మల్లన్న సన్నిధిలో మంత్రి

ABN , First Publish Date - 2021-08-28T04:48:34+05:30 IST

భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లను శుక్రవారం రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఎం.శ్రీనివాసరావు దర్శించుకున్నారు.

మల్లన్న సన్నిధిలో మంత్రి


శ్రీశైలం, ఆగస్టు 27:  భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లను శుక్రవారం రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఎం.శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం ఈవో ఎస్‌. లవన్న స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో మంత్రి శ్రీనివాసరావుకు ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేసి, స్వామివార్ల శేషవస్త్రాన్ని, ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆగమశాస్త్ర ప్రకారం దేవాలయం విధి విధానాలను పాటిస్తూ టూరియిజం పరంగా శ్రీశైల క్షేత్రం అభివృద్ధి చేసేందుకు ఎక్కువ అవకాశం ఉందన్నారు. 


Updated Date - 2021-08-28T04:48:34+05:30 IST