మినీ రైతుబజార్లు
ABN , First Publish Date - 2021-05-08T05:30:00+05:30 IST
నగరంలో రోజూ వేలాది మంది కూరగాయల కోసం సి.క్యాంప్ రైతు బజార్‌తో పాటు అమీన్ అబ్బాస్ నగర్, కొత్తపేట రైతు బజార్‌కు వెళ్తుంటారు.

కరోనా కట్టడి కోసం అధికారుల చర్యలు
కర్నూలు(అగ్రికల్చర్), మే 8: నగరంలో రోజూ వేలాది మంది కూరగాయల కోసం సి.క్యాంప్ రైతు బజార్‌తో పాటు అమీన్ అబ్బాస్ నగర్, కొత్తపేట రైతు బజార్‌కు వెళ్తుంటారు. ప్రస్తుతం కరోనా విజృంభన నేపథ్యంలో పలుచోట్ల సంచార, మినీ రైతుబజార్లు ఏర్పాటు చేశారు.
నగరంలో మినీ రైతు బజార్లు
- వెంకాయపల్లె పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా
- నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతం
- నంద్యాల రోడ్డులోని మారుతి మెగాసిటీ
- జోహరాపురం పాత డంప్ యార్డు వద్ద ఉన్న రహదారి వద్ద
- అమ్మ హాస్పిటల్ వద్ద మున్సిపల్ పార్కులో
- కోడుమూరు రోడ్డులో అమీలియో హాస్పిటల్ వద్ద
- ఉస్మానియా కళాశాలలో అరబిక్ కాలేజీ మైదానంలో
- కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో రీటైల్ కూరగాయల విక్రయాలు పెద్దపాడు వద్దకు తరలింపు
- బి.క్యాంపు వద్ద మీనీ కూరగాయల మార్కెట్
ప్రజలు సహకరించాలి
కరోనా కట్టడికి చర్యలు చేపట్టాం. ప్రజలు కూడా సహ కరించాలి. ప్రజలు అందుబాటులో ఉన్న మొబైల్ రైతుబజార్లు, మినీ రైతుబజార్ల వద్దకు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేయాలి.
- సత్యనారాయణ చౌదరి, ఏడీఎం