ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు

ABN , First Publish Date - 2021-10-20T05:18:50+05:30 IST

మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం సంద ర్భంగా ముస్లింలు మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీను జరుపుకు న్నారు. స్థానిక జామియా మసీదు నుంచి ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్‌ ప్రవక్త బోధనలను ఆచరిస్తామన్నారు.

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు

ఆలూరు, అక్టోబరు 19: మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం సంద ర్భంగా ముస్లింలు మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీను జరుపుకు న్నారు. స్థానిక జామియా మసీదు నుంచి ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్‌ ప్రవక్త బోధనలను ఆచరిస్తామన్నారు. 


ఎమ్మిగనూరు టౌన్‌: పట్టణంలో మిలాద్‌ ఉన్‌ నబీ పండుగ వేడుకలు మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మసీదులలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ముస్లింలు మసీదుల నుంచి ర్యాలీ నిర్వహించారు. సోమప్ప సర్కిల్‌లో జెండాలు చేతబట్టి నారే తగ్బీర్‌ అల్లాహ్‌ అక్బర్‌ అంటూ నినదించారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ పీఠాధిపతులు, ముస్లిం మత పెద్దలు హజరత్‌ సయ్యద్‌ సైఫుద్దీన్‌ సాహెబ్‌, సయ్యద్‌ హుసేన్‌ బాషా సాహెబ్‌, సయ్యద్‌ ఖాజీమ్‌ బాషా సాహెబ్‌, మౌలానా హనీఫ్‌ ఖాద్రీ, మౌలానా జిలాన్‌, పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T05:18:50+05:30 IST