క్రీడలతో మానసిక ఉల్లాసం

ABN , First Publish Date - 2022-01-01T04:59:12+05:30 IST

మంత్రాలయం నియోజకవర్గ స్థాయి ఏపీ సీఎం కప్‌ క్రీడా పోటీల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం మౌంట్‌ కార్నల్‌ పాఠశాలలో క్రీడా పోటీలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫాదర్‌ రిమ్సన్‌, పీడీ ఖలీల్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం

కోసిగి, డిసెంబరు 31: మంత్రాలయం నియోజకవర్గ స్థాయి ఏపీ సీఎం కప్‌ క్రీడా పోటీల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం  మౌంట్‌ కార్నల్‌ పాఠశాలలో క్రీడా పోటీలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫాదర్‌ రిమ్సన్‌, పీడీ ఖలీల్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏపీ సీఎం కప్‌ క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పీడీ ఖలీల్‌ అహ్మద్‌ తెలిపారు.  ఈ  పీడీలు నరసింహరాజు, బసవరాజు, శ్రీనివాసులు, ఈరన్న, పీఈటీలు వెంకటేష్‌, భాషా, అంజి, ఆనంద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-01T04:59:12+05:30 IST