నాడు-నేడులో మెమోలు
ABN , First Publish Date - 2021-02-06T05:33:37+05:30 IST
నాడు-నేడు పథకం పనుల్లో బాధ్యతారహితంగా ప్రవర్తించిన 8 మంది పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ఎస్‌వోలు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు మెమోలు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం శుక్రవారం తెలిపారు.

- ఆర్వో ప్లాంట్ల ప్రతిపాదనలపై డీఈవో చర్య
కర్నూలు(ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 5: నాడు-నేడు పథకం పనుల్లో బాధ్యతారహితంగా ప్రవర్తించిన 8 మంది పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ఎస్‌వోలు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు మెమోలు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం శుక్రవారం తెలిపారు. నాడు-నేడు పథకం కింద పాఠశాలలకు ఆర్వో ప్లాంట్స్ యూనిట్స్ పరికరాలను ఏజెన్సీలు తీసుకువస్తే.. తమకు అవసరం లేదని ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు వెనక్కి పంపించారు. వారు ఆర్వో పాంట్లు కావాలని ఏజెన్సీలకు ప్రతిపాదనలు పంపించారు. అయితే అప్పటికే ఉన్న ఆర్వో పాంట్లను మరమ్మతు చేయించినందు వల్ల కొత్త ప్లాంట్లు అవసరం లేదని వెనక్కి పంపించారు. ప్లాంట్లు ఉండగా .. మళ్లీ ఎందుకు ప్రతిపాదనలు పంపారని, ఈ విషయంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని డీఈవో వారికి షోకాజ్ నోటీసులు పంపారు. బండి ఆత్మకూరు, దేవనకొండ కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మండిగేరి, పర్ల జడ్పీహెచ్‌ఎ్‌స పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కర్నూలు కింగ్ మార్కెట్ బాలికల ఉన్నత పాఠశాల, వెల్‌కం హోటల్ దగ్గర ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, కల్లూరు బీ.క్యాంపులోని గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్‌కు, నంద్యాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు మెమోలు ఇచ్చినట్లు డీఈవో తెలిపారు.