వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ను తొలగించాలి

ABN , First Publish Date - 2021-05-21T05:38:11+05:30 IST

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ను విధుల నుంచి తొలగిచాలని నందికొట్కూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వైద్యాధికారి రాయుడు, వైద్య సిబ్బంది నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ను తొలగించాలి
నందికొట్కూరులో నిరసన తెలుపుతున్న వైద్యాధికారులు, సిబ్బంది

  1. నల్లబ్యాడ్జీలతో వైద్య సిబ్బంది నిరసన


నందికొట్కూరు, మే 20: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ను విధుల నుంచి తొలగిచాలని నందికొట్కూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వైద్యాధికారి రాయుడు, వైద్య సిబ్బంది నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్‌జీవో కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య శాఖపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమిషనర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో జాయింట్‌ సెక్రటరీ క్రిష్ణమూర్తి, వైద్యాధికారి శివాని, సిబ్బంది పాల్గొన్నారు. 


బనగానపల్ల్లె: వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్ర కమిషనర్‌ను విధుల నుంచి తొలగించాలని బనగానపల్లె ఎన్‌జీవో సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆరోగ్య సిబ్బంది గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. బనగానపల్లె ప్రభుత్వవైద్యశాలలో సివిల్‌సర్జన్‌ సుజాత, టంగుటూరు, పలుకూరు, ఉప్పలపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఆయా మెడికల్‌ ఆఫీసర్లు, సిబ్బంది, ఏపీఎన్‌జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి అల్తా్‌ఫహుస్సేన్‌ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కరో నా విఽధుల్లో,  ఫీవర్‌ సర్వేలో వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తోంటే ఇటీవల వీడియో కాన్ఫరెన్సులో కమిషనర్‌ వైద్య సిబ్బంది, డాక్టర్లపై విరుచుకుపడడం అన్యాయమన్నారు. తక్షణమే ఆయనను తొలగిం చాలని కోరారు.  


కొలిమిగుండ్ల:  కొలిమిగుండ్ల ప్రభుత్వాస్పత్రిలోని వైద్యసిబ్బంది గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆరోగ్యశాఖ మంత్రిని ప్రభుత్వ వైద్యసిబ్బందిని ఇటీవల అనుచితంగా మాట్లాడి అవమానపరిచారని, దీనికి నిరసనగా కొలిమిగుండ్ల ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు, వైద్యసిబ్బంది మాస్క్‌లు, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రాజ్‌కుమార్‌, నంద్యాల డివిజన్‌ ఎన్జీవోస్‌ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, ఎంపీహెచ్‌ఈవో సుదర్శన్‌రెడ్డి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 


రుద్రవరం: కరోనాతో పోరాటం చేస్తూ ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్న వైద్యాధికారుల ఆత్మాభిమానం దెబ్బతీయద్దని వైద్యాధికారులు గాయత్రి, రెడ్డికిషోర్‌ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మండలంలోని ఆరోగ్య సబ్‌సెంటర్లలో వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ మాట్లాడిన తీరుకు నిరసనగా ధర్నా చేపట్టి నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు. సీఎ్‌ఫడబ్ల్యూ రాష్ట్రస్థాయిలో పెట్టిన తీవ్రమైన ఒత్తిడి చాలా మంది భయభ్రాంతులకు, తీవ్రమైన మనోవేదనకు గురౌతున్నారని అన్నారు.  ఈ కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్లు బాబయ్య, ఫార్మాసిస్టు మహేశ్వరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-21T05:38:11+05:30 IST