మేడే వారోత్సవాలు

ABN , First Publish Date - 2021-05-02T05:30:00+05:30 IST

కార్మికుల హక్కుల పరిరక్షణకు కలిసి పోరాడదమని సీపీఐ ఆళ్లగడ్డ నియోజకవర్గ కార్యదర్శి భాస్కర్‌ అన్నారు.

మేడే వారోత్సవాలు

రుద్రవరం, మే 2: కార్మికుల హక్కుల పరిరక్షణకు కలిసి పోరాడదమని సీపీఐ ఆళ్లగడ్డ నియోజకవర్గ కార్యదర్శి భాస్కర్‌ అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దకంబలూరు గ్రామంలో 135వ మేడేలో భాగంగా జాలాది రాజన్న జెండాను ఆవిష్కరించారు. భాస్కర్‌ మాట్లాడుతూ ఎందరో  ప్రాణాలు అర్పించి, పోరాటాలు చేసి సాధించిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి పారిశ్రామికవేత్తలు శ్రమ దోపిడీ చేయడానికి ద్వారాలు తెరిచిందని ఆరోపించారు. కార్మిక చట్టాలను రద్దు చేయడం, పనిగంటలు, ఉద్యోగ భద్రతపై దాడి చేయడంతో పాటు కార్మికులను కట్టుబానిసలుగా చేయడానికి 44వ కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లెబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందని అన్నారు. దీంతో కార్మికుల భవిషత్తు ప్రశ్నార్థకం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం కార్యదర్శి బాలనరసింహుడు, అంబేద్కర్‌ యువజన సంఘం సభ్యులు, రైతులు, సీపీఐ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 


ఆత్మకూరురూరల్‌: శ్రమ దోపిడీపై పోరాడి చనిపోయిన అమరవీరులకు నివాళులు అర్పించే రోజు మేడే అని, కార్మిక వర్గానికి స్ఫూర్తి మేడే అని సీపీఎం మండల కార్యదర్శి నరసింహనాయక్‌, మండల నాయకులు వెంకటేశ్వర్లులు అన్నారు. ఆదివారం కొత్తరామాపురం, ఇందిరేశ్వరం చెంచుగూడేళ్ళో మేడే వారోత్సవాల సందర్భంగా జెండాను ఎగురవేశారు. ఆయా సంఘాల నాయకులు జయపాల్‌, ఫక్కీరయ్య, చిన్న సుబ్బరాయుడు, వీరన్న లింగస్వామి, పెద్దన్న,నాగమ్మ,లింగమ్మ  పాల్గొన్నారు.


మిడుతూరు: మేడేను పురస్కరించుకుని ఆదివారం మిడుతూరులో ఐఎ్‌ఫటీయూ జెండాను జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్‌ ఆవిష్కరించారు. సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా నాయకుడు నరసిహులు, రమణయ్యశెట్టి, ఎల్లానాయుడు, పుల్లన్న, శేఖర్‌నాయుడు ఉన్నారు.


జూపాడుబంగ్లా: మేడే ఉత్సవాలను మండలంలోని బాస్కరపురంలో ఆదివారం న్విహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఏఐటీయూసీ రాష్ట్ర సమితి నాయకులు రమేష్‌ బాబు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. 


Updated Date - 2021-05-02T05:30:00+05:30 IST