గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-12-08T05:47:18+05:30 IST

నంద్యాల రైల్వేస్టేషన్‌లో 26 కేజీల గంజాయిని జనరల్‌ రైల్వే పోలీసు ఎస్‌ఐ నాగరాజు, సిబ్బంది పట్టుకున్నారు.

గంజాయి పట్టివేత

నంద్యాల (నూనెపల్లె), డిసెంబరు 7: నంద్యాల రైల్వేస్టేషన్‌లో 26 కేజీల గంజాయిని జనరల్‌ రైల్వే పోలీసు ఎస్‌ఐ నాగరాజు, సిబ్బంది పట్టుకున్నారు.  మంగళవారం గుంటూరు నుంచి కాచిగూడకు వెళుతున్న డెమో రైలులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించామని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. ఈ సోదాల్లో ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఓబురాయి సుభాష్‌ అనే వ్యక్తి వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. అతని వద్ద ఉన్న 13గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఒక్కొ ప్యాకెట్‌లో 2కేజీల గంజాయి ఉందన్నారు.   నంద్యాల తహసీల్దార్‌ రవికుమార్‌   గంజాయి ప్యాకెట్లకు పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. దీని విలువ రూ.2.60 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు.   కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. Updated Date - 2021-12-08T05:47:18+05:30 IST