పాలరాతి మహా విష్ణువు విగ్రహం అందజేత
ABN , First Publish Date - 2021-11-29T05:09:21+05:30 IST
మహానంది క్షేత్రంలోని కోదండరామాలయంలో ఏర్పాటు చేసేందుకు నంద్యాలకు చెందిన శ్రీకాంత పాలరాతి మహావిష్ణు విగ్రహాన్ని ఆలయ ఈవో మల్లికార్జునప్రసాద్కు అందజేశారు.

మహానంది, నవంబరు 28: మహానంది క్షేత్రంలోని కోదండరామాలయంలో ఏర్పాటు చేసేందుకు నంద్యాలకు చెందిన శ్రీకాంత పాలరాతి మహావిష్ణు విగ్రహాన్ని ఆలయ ఈవో మల్లికార్జునప్రసాద్కు అందజేశారు. పూర్వం కోదండరామాలయంలో ఏర్పాటు చేసిన పాలరాతి మహావిష్ణు విగ్రహం శిఽథిలావస్థకు చేరుకుంది. జైపూరు నుంచి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి, దాని స్థానంలో ఏర్పాటు చేయాలని ఆలయ ఈవోకు అప్పగించినట్లు వేదపండితులు రవిశంకర్ అవధాని తెలిపారు. డిసెంబరు 2న ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో ఎర్రమల్ల మధు, అర్చకులు రాజ రత్తయ్యబాబు పాల్గొన్నారు.