‘రమ్యశ్రీని హత్య చేసిన వ్యక్తిని శిక్షించాలి’

ABN , First Publish Date - 2021-08-22T04:30:50+05:30 IST

దళిత యువతి రమ్యశ్రీని దారుణంగా హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

‘రమ్యశ్రీని హత్య చేసిన వ్యక్తిని శిక్షించాలి’


పాములపాడు ఆగస్టు 21: దళిత యువతి రమ్యశ్రీని దారుణంగా హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకులు స్వాములు,  మండల నాయకులు పెద్దన్న సురేష్‌ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వారు  మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని, దళిత మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫమైందని ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-22T04:30:50+05:30 IST