రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-02-01T06:21:41+05:30 IST

మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురం రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినయ్‌కుమార్‌ (35) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

బేతంచెర్ల, జనవరి 31: మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురం రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినయ్‌కుమార్‌ (35) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. డోన్‌ రైల్వే ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలివి.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినయ్‌కుమార్‌  రైల్వే క్యాంటీన్‌లో పనిచేస్తూ ఉండేవాడని, రంగాపురం రైల్వేస్టేషన్‌లో రైలు ఆగి ఉండడంతో వినయ్‌కుమార్‌ మద్యం మత్తులో రైల్వేట్రాక్‌పై పడుకోగా రైలు అతని మీదుగా వెళ్లడంతో మృతి చెందాడని తెలిపారు. చనిపోయిన వ్యక్తి వద్ద ఉన్న గుర్తింపు కార్డు పరిశీలించగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వద్ద ఉన్న తందోళి జిల్లా గంజెబద్నే గ్రామానికి చెందిన వినయ్‌కుమార్‌గా గుర్తించినట్లు తెలిపారు. మృతుడికి భార్య విజేత, నలుగురు సంతానం ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డోన్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు రైల్వే ఎస్‌ఐ తెలిపారు.  


Updated Date - 2021-02-01T06:21:41+05:30 IST