గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-25T06:18:46+05:30 IST

మండలంలోని కంబాల పల్లె ఎర్రగూడూరు గ్రామాల మధ్య గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఎర్ర గూడూరు గ్రామానికి చెందిన బుడగ జం గాల వెంకటరమణ మృతి చెందాడు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

పాములపాడు  డిసెంబరు 24: మండలంలోని కంబాల పల్లె ఎర్రగూడూరు గ్రామాల మధ్య గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఎర్ర గూడూరు గ్రామానికి చెందిన బుడగ జం గాల వెంకటరమణ మృతి చెందాడు. ఎర్రగూడూరు గ్రామానికి చెందిన వెంకటరమణ గురువారం రాత్రి సైకిల్‌పై పొలానికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మృతుని తండ్రి సుంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌  చిట్టిబాబు తెలిపారు. Updated Date - 2021-12-25T06:18:46+05:30 IST