‘ధర్నాను విజయవంతం చేయండి’
ABN , First Publish Date - 2021-12-16T04:58:27+05:30 IST
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని 20న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ పిలుపునిచ్చారు.

కొలిమిగుండ్ల, డిసెంబరు 15: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని 20న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ పిలుపునిచ్చారు. కొలిమిగుండ్ల మండలంలోని బెలుంగుహల గెస్ట్‌హౌ్‌సలో కార్యకర్తల సమావేశం బుధవారం మండలాధ్యక్షుడు కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా పోరాటాలు ఉధృతం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డప్పు, చర్మకారుల రాష్ట్ర కన్వీనర్ నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షుడు మద్దిలేటి, రాము, కంబగిరి, కార్యకర్తలు పాల్గొన్నారు.