‘ఛలో ఢిల్లీని విజయవంతం చేయండి’

ABN , First Publish Date - 2021-11-24T04:55:04+05:30 IST

హలో మాదిగ, ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని డిసెంబర్‌ 14న విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకుడు స్వాములు మాదిగ అన్నారు.

‘ఛలో ఢిల్లీని విజయవంతం చేయండి’


పాములపాడు నవంబర్‌ 23: హలో మాదిగ, ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని  డిసెంబర్‌ 14న  విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకుడు స్వాములు మాదిగ అన్నారు. మంగళవారం మండలంలోని మద్దూరు గ్రామంలో ఈ మేరకు విద్యార్థులను చైతన్య పరిచారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణ జరిగితే తప్ప మాదిగలకు భవిష్యత్తు లేదని, గత 27 ఏళ్ళుగా పోరాటాలు చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టేలా  ఒత్తిడి తెచ్చేందుకే  ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకటస్వామి, రాజు, పెద్దన్న, సాగర్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-24T04:55:04+05:30 IST