మద్దిలేటి స్వామి ఆదాయం రూ.6.01లక్షలు

ABN , First Publish Date - 2021-12-26T05:33:05+05:30 IST

మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి, మహాలక్ష్మి అమ్మవార్ల క్షేత్రానికి ఆదాయం రూ.6.01 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో పాండురంగారెడ్డి, చైర్మన్‌ లక్ష్మీరెడ్డి శనివారం తెలిపారు.

మద్దిలేటి స్వామి ఆదాయం రూ.6.01లక్షలు

బేతంచెర్ల, డిసెంబరు 25: మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి, మహాలక్ష్మి అమ్మవార్ల క్షేత్రానికి ఆదాయం రూ.6.01 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో పాండురంగారెడ్డి, చైర్మన్‌ లక్ష్మీరెడ్డి శనివారం తెలిపారు. మద్దిలేటిస్వామి, మహాలక్ష్మి అమ్మవార్ల సేవా టికెట్ల ద్వారా, లడ్డూ ప్రసాదాలు, రూము బాడుగల ద్వారా విరాళాలు, లీజుల ద్వారా రూ.6,01,761 క్షేత్రానికి ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో పాండురంగారెడ్డి తెలిపారు. ఆలయ నిర్మాణానికి రూ.85 వేలు భక్తుల విరాళం అందజేసినట్లు ఈవో పాండురంగారెడ్డి తెలిపారు. కర్నూలు బి.తాండ్రపాడుకు చెందిన బాలాజీరావు జ్ఞాపకార్థం ఆయన ధర్మపత్ని రమణమ్మ రూ.55వేలు, వెల్దుర్తి మండలం కలుగోట్ల గ్రామానికి చెందిన ఎర్రవాటి నాగేశ్వరరావు కుమారుడు రామన్న రూ.30వేలు విరాళంగా అందజేశారని ఈవో తెలిపారు.

Updated Date - 2021-12-26T05:33:05+05:30 IST