నేటి నుంచి లోక్ అదాలత్
ABN , First Publish Date - 2021-08-26T05:24:28+05:30 IST
నందికొట్కూరు కోర్టులో గురువారం నుంచి ప్రతి రోజూ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ శ్రీవిద్య, జూనియర్ సివిల్ జడ్జి తిరుమలరావు తెలిపారు.

నందికొట్కూరు, ఆగస్టు 25: నందికొట్కూరు కోర్టులో గురువారం నుంచి ప్రతి రోజూ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ శ్రీవిద్య, జూనియర్ సివిల్ జడ్జి తిరుమలరావు తెలిపారు. కోర్టులో బుధవారం వారు విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ పరిస్థిల వల్ల రోజూ లోక్ అదాలత్ నిర్వహించి కేసుల పరిష్కరించనుట్లు తెలిపారు. శనివారం 1.30 గంటలకు బార్ అసోసియేషన్, 11.30 గంటలకు పోలీసులతో సమావేశం నిర్వహించి ఎన్ని కేసులు రాజీ మార్గం ద్వారా సామరస్యంగా పరిష్కరించేందుకు అవకాశం ఉందనే వివరాలను తెలుసుకుంటామని తెలిపారు.