రుణాలు సక్రమంగా చెల్లించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-10-30T04:34:02+05:30 IST

బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న లబ్ధిదారులు సక్రమంగా చెల్లించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు.

రుణాలు సక్రమంగా చెల్లించాలి: కలెక్టర్‌

కర్నూలు(న్యూసిటీ), అక్టోబరు 29: బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న లబ్ధిదారులు సక్రమంగా చెల్లించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు. నగరంలోని రావూరి ఫంక్షన్‌ హాలులో  శుక్రవారం రుణవితరణ కార్యక్రమం నిర్వహించారు. జేసీ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు,  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విజయవాడ డీజీఎం సోమశేఖర్‌ హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బ్యాంకులు ఇచ్చే రుణాలతో ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. జిల్లాలో 27404 మంది లబ్ధిదారులకు రూ.521.87 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌  వెంకటనారాయణ మాట్లాడుతూ జిల్లాలో రుణమేళాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన వ్యవసాయ, విద్య, చిన్న పరిశ్రమల స్థాపనకు సంబంధించిన రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఏపీజీబీ జీఎం విజయభాస్కర్‌, నాబార్డు డీడీఎం ఎ.పార్థవ, కెనరా బ్యాంక్‌ ఇన్‌చార్జి రీజనల్‌ హెడ్‌ ఎల్‌.రాధాకృష్ణారెడ్డి, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్‌ఎం ప్రశాంత్‌ దేశాయ్‌, ఎస్‌బీఐ ఆర్‌ఎం సూర్యప్రకాష్‌, ఏపీజీబీ ఆర్‌ఎం ఎస్‌.భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T04:34:02+05:30 IST