పశు దాణ తయారీ, విక్రేతలు లైసెన్సు తీసుకోవాలి: జేడీ
ABN , First Publish Date - 2021-12-31T05:06:52+05:30 IST
పశుదాణ ఉత్పత్తి దారులు, విక్రయందారులు ఈ నెలాఖరులోగా లైసెన్సు తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ జేడీ రమణయ్య తెలిపారు.

కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 30: పశుదాణ ఉత్పత్తి దారులు, విక్రయందారులు ఈ నెలాఖరులోగా లైసెన్సు తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ జేడీ రమణయ్య తెలిపారు. గురువారం జేడీ మాట్లాడుతూ లైసెన్సు కోసం మీ పరిధిలోని ఆర్‌బీకే కేంద్రాల్లో పశువైద్య సహాయకులను సంప్రదించి అనిమల్ ఫీడ్ లైసెన్సు కోసం అవసరమైన ధ్రువపత్రాలను దరఖాస్తుకు జతచేసి అందజేయాలని సూచించారు. లైసెన్సు పొందని వారు పశుదాణా ఉత్పత్తి, విక్రయాలు జరపడానికి అవకాశం ఉండదని, ప్రభుత్వ ఆదేశాలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.