‘వైఎస్సార్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం’

ABN , First Publish Date - 2021-09-03T05:00:53+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజలహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని శ్రీశైలం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, తొగూరు ఆర్థర్‌ అన్నారు.

‘వైఎస్సార్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం’
స్మృతివనంలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యేలు శిల్పా, ఆర్థర్‌

ఆత్మకూరు, సెప్టెంబరు 2: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజలహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని శ్రీశైలం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, తొగూరు ఆర్థర్‌ అన్నారు. గురువారం వైఎస్‌ఆర్‌ 12వ వర్ధంతిని పురస్కరించుకుని నల్లకాల్వ గ్రామ సమీపంలోని స్మృతివనంలో వైఎస్‌ఆర్‌ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందించారని కొనియాడారు. వైఎస్‌ఆర్‌ పాలనలో ప్రతి కుటుంబానికి చేయూత లభించిందని అన్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ఆత్మకూరులోని నంద్యాల టర్నింగ్‌ వద్ద ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఆత్మకూరు పట్టణ శివార్లలోని ఆటో నగర్‌లో రూ.34.20 లక్షలతో చేపట్టిన తాత్కాళిక రహదారుల నిర్మాణాలను శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎంఏ.రషీద్‌, అంజాద్‌అలి, పువ్వాడి భాస్కర్‌, విజయ్‌ చౌదరి, మోమిన్‌ మునీర్‌బాషా, షాకీర్‌ హుసేన్‌ రాజగోపాల్‌, తిరుపమరెడ్డి, సయ్యద్‌ మీర్‌, కరివేన సురేష్‌, గౌస్‌లాజం ఉన్నారు. 

నందికొట్కూరు/ జూపాడుబంగ్లా / నందికొట్కూరు రూరల్‌/ పాములపాడు: నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు మండలాలతోపాటు బ్రాహ్మణకొట్కూరులో ఉన్న వైఎస్సార్‌ విగ్రహాలకు ఎమ్మెల్యే ఆర్థర్‌ పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో చెరుకుచర్ల రఘురామయ్య, ధర్మారెడ్డి, షుకూర్‌మియా, జంగాల పెద్దన్న, ఉస్మాన్‌ బాషా, మాజీ కోఆప్షన్‌ సభ్యులు మహబూబ్‌బాషా పాల్గొన్నారు.

బనగానపల్లె: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా గురువారం బనగానపల్లె పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అవుకు మెట్ట వద్ద వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుజాత, కాటసాని తిరుపాల్‌రెడ్డి, అబ్దుల్‌ఖైర్‌, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ దీవెనమ్మ, యాగంటి ఆలయ చైర్మన్‌ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

అవుకు: పట్టణంలోని అంబేడ్కర్‌ కాలనీలోని వైఎస్సార్‌ విగ్రహానికి ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ ఉప సర్పంచ్‌ చల్లా రఘునాథరెడ్డి, వైసీపీ నాయకులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జయ చంద్రారెడ్డి, డాక్టర్లు ఎల్లా రాముడు, చిన్న మద్దిలేటి పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T05:00:53+05:30 IST