హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందాం

ABN , First Publish Date - 2021-08-22T04:30:09+05:30 IST

హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు హిందువులందరూ ఐక్యంగా మెలగాలని నంద్యాల జిల్లా విశ్వహిందూ పరిషత జిల్లా అధ్యక్షుడు మన్నం విష్ణువర్ధనరెడ్డి అన్నారు.

హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందాం

 వీహెచపీ జిల్లా అధ్యక్షుడు వై. విష్ణువర్ధనరెడ్డి


ఆత్మకూరు, ఆగస్టు 21: హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు హిందువులందరూ ఐక్యంగా మెలగాలని నంద్యాల జిల్లా విశ్వహిందూ పరిషత జిల్లా అధ్యక్షుడు మన్నం విష్ణువర్ధనరెడ్డి అన్నారు. శనివారం స్థానిక వాసవీ కళ్యాణ మంటపంలో ఆత్మకూరు ప్రఖంఢ విశ్వహిందూ పరిషత కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల్లో ఐక్యత లేకపోవడం వల్లే ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని, అన్యమతస్తుల పెత్తనం అధికమైందని అన్నారు. వీటన్నింటి అధిగమించి హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రతిహిందువు బాధ్యతగా మెలగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆత్మకూరు ప్రకంఢ నూతన కమిటీ గౌరవాధ్యక్షులు వి.రాజశేఖర్‌, కార్యధ్యక్షులుగా గరుడాద్రి సుదర్శనశర్మ, ఉపాధ్యక్షులుగా శ్రీధర్‌గుప్త, సుబ్బరాయుడు, ప్రధాన కార్యదర్శిగా ఆదినారాయణ, కార్యదర్శులుగా రామసుబ్బాచారి, రాసంశెట్టి చంద్రశేఖర్‌, కోశాధికారిగా ప్రశాంత, అర్చక ప్రముఖ్‌గా గరుడాద్రి సత్యనారాయణశర్మ, న్యాయసలహా ప్రముఖ్‌గా రామకృష్ణలతోపాటు మిగతా కార్యవర్గాన్ని ఏకగీవ్రంగా ఎంపిక చేశారు. అనంతరం నూతనంగా ఎంపికైన కమిటిని సత్కరించారు. ఈ సమావేశంలో వీహెచపీ జిల్లా కార్యదర్శి సందీప్‌, ఆర్యవైశ్య సంఘం ఆత్మకూరు అధ్యక్షుడు భీమిశెట్టి కృష్ణమూర్తి, వీహెచపీ నాయకులు వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-08-22T04:30:09+05:30 IST