అంబేడ్కర్‌ స్ఫూర్తిని కొనసాగిద్దాం

ABN , First Publish Date - 2021-12-07T05:36:58+05:30 IST

భారత దేశ రాజ్యాంగ నిర్మాణం కోసం కృషి చేసి చేసిన డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చే దిశగా పయనించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు.

అంబేడ్కర్‌ స్ఫూర్తిని కొనసాగిద్దాం
అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు

కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు  

కర్నూలు(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 6: భారత దేశ రాజ్యాంగ నిర్మాణం కోసం కృషి చేసి చేసిన డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చే దిశగా పయనించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. సోమవారం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి పురస్కరించుకుని కర్నూలు పాతబస్టాండు సమీపంలోని విగ్రహానికి కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు, డీఆర్వో పుల్లయ్య, ఆర్డీవో హరిప్రసాద్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగానికి అందించిన మహోన్నత వ్యక్తి, అత్యంత మేధా సంపత్తి కలిగిన గొప్ప దార్శనికుడు డా.అంబేడ్కర్‌ అని అన్నారు. వారి జీవితం మొత్తం దేశానికి, అణగారిన పేద బడుగు బలహీన వర్గాల కోసం త్యాగం చేసిన మహానీయుడు అని కొనియాడారు. రాజ్యాంగ పితామహుడు, ప్రపంచ మేధావి అంబేడ్కర్‌ బాటలో ప్రజలు పయనించాలని అన్నారు. కుల, మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా జీవించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ సంచాలకులు ప్రతాప్‌, సూర్యనారాయణరెడ్డి, కర్నూలు అర్బన్‌ తహసీల్దార్‌ పాల్గొన్నారు.

కర్నూలు(న్యూసిటీ): డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశ యాలను కొనసాగిద్దామని రచ్చ బండ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు వి.శ్రీనివాసులు అన్నారు. సోమవారం పాత బస్టాండు వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్ర మంలో  కార్యదర్శి గిరిధర్‌, కోశాధికారి రంగముని, నరసింగరావు, సత్యబాబు, మన్మథరావు, కపిలేశ్వరరావు పాల్గొన్నారు. 

- వైసీపీ నాయకులు అంబేడ్కర్‌ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కేదార్‌ నాథ్‌, రైల్వేప్రసాద్‌ పాల్గొన్నారు. 

కర్నూలు(స్పోర్ట్స్‌): స్థానిక అంబేడ్కర్‌ భవనంలో అంబేడ్కర్‌ విగ్రహానికి మాజీ కార్పొరేటర్‌ జి.సురేందర్‌ తో పాటు దళిత నాయకులు సోమసుందరం, బాబుజి, మానిటరింగ్‌ కమిటీ సభ్యులు సఫాయి కర్మచారీలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

కర్నూలు(హాస్పిటల్‌): భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ వైద్య ఉద్యోగుల సంఘం ఘన నివాళులర్పించింది. సోమవారం అంబేడ్కర్‌ చిత్రపటానికి సంఘం జిల్లా అధ్యక్షుడు కార్యాలయ సూపరింటెం డెంట్‌ కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి హెచ్‌ఈ ఈవో ప్రకాష్‌రాజ్‌ నివాళి అర్పించారు. 

కర్నూలు(అగ్రికల్చర్‌): భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ 65వ వర్ధంతి కార్యక్రమాన్ని కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ కర్నూలు నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్రకుమార్‌, తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్‌, హనుమంతరావు చౌదరి, రామాంజినేయులు, శాంతరాజు, ఎల్లప్ప, జలీల్‌బాషా పాల్గొన్నారు.

బేతంచెర్ల: దళిత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్‌ సీహెచ్‌ శేషాచలం రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు మూర్తుజావలి, బాబుల్‌ రెడ్డి, రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మురళీకృష్ణ, శ్రీను, రామసుబ్బయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే టీడీపీ నాయకులు మేకల నాగరాజు, పిడతల రూబేన్‌, తాలుకా రాజయ్య, మాదిగ మాధవ్‌, శివ, కార్యకర్తలు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సిమెంట్‌ నగర్‌లో టీడీపీ నాయకుడు రాముడు ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

డోన్‌(రూరల్‌): పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. కాంగ్రెస్‌ లోక్‌సభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గార్లపాటి మద్దిలేటి, నియోజకవర్గ కార్యదర్శి జనార్దన్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సీపీఐ నియోజ కవర్గ కార్యదర్శి రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రాధాకృష్ణ, ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మోటరాముడు, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు ప్రభాకర్‌, అనుబంధ సంఘాల నాయకులు అబ్బాస్‌, శివన్న, రమేష్‌ తదితరులు అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధికార ప్రతినిధి గుండాల ఈశ్వరయ్య మాదిగ అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. అలాగే డోన్‌ వీఆర్వోలు మల్లారెడ్డి, మహానంది, మోహన్‌రావు, రాజు, విజయ మనోహర్‌, ప్రసాద్‌, మహేశ్వరయ్య, మాధవస్వామి, అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. అలాగే ఏబీవీపీ నాయకులు బానాల హనుమంతు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. మండలంలోని కొత్తకోటలో బహుజన స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నాయకులు విజయభాస్కర్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. 

ప్యాపిలి: మండలంలోని పీఆర్‌పల్లి ఉన్నత పాఠశాలలో సోమవారం అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ప్యాపిలిలో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్ధంతి వేడుకులు నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు నరసింహారెడ్డి, చంద్రమోహన్‌, ఖాజాబీ, సరోజ, రమణరావు, రాజాకుల్లాయప్ప, వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు బాలరంగన్న, రామచంద్రుడు, మద్దిలేటి, కలచట్ల వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.

వెల్దుర్తి: పాతబస్టాండులోని అంబేడ్కర్‌ విగ్రహానికి మాజీ జడ్పీటీసీ ఐజయ్య, బజారు, గిడ్డయ్య, మాల మహానాడు మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏపీ ఎమ్మార్పీఎస్‌ నాయకులు సుధీర్‌బాబు, లీడర్స్‌ యూత్‌ సొసైటీ అధ్యక్షులు కేదార్‌నాథ్‌, నవీన్‌లు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 

సి. బెళగల్‌: మండల కేంద్రంలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి టీడీపీ మండల కన్వీనర్‌ బీఎస్‌ తిమ్మప్ప టీడీపీ జిల్లా రైతు నాయకుడు పాండురంగన్నగౌడు, ధనుంజయడు, దూద్‌వలి, నాగరాజు, గిడ్డయ్యగౌడు, వెంకటప్ప, గంపరాజు వెంకటేశ్వర్లు తదితరులు అంబేడ్కర్‌కు నివాళి అర్పించారు.

గూడూరు: వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద ఇళ్లకు డబ్బులు చెల్లించవద్దని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని కోడు మూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆకేపోగు ప్రభాకర్‌ అన్నారు. సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో టీడీపీ ఇన్‌చార్జి ఆకేపోగు ప్రభాకర్‌ గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్‌ ప్రాంతంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎల్‌ సుధాకర్‌రెడ్డి, కర్నూలు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి దండు సుందర రాజు పాల్గొన్నారు. అలాగే సోమవారం మాజీ జడ్పీటీసీ, పాఠశాల చైర్మన్‌ ఎల్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కోట్ల టీమ్‌ టీడీపీ తెలుగు యువత కర్నూలు పార్లమెంట్‌ కార్యదర్శి చరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్‌ రేమట సురేష్‌, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోడుమూరు షాషావళి, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

కర్నూలు(అర్బన్‌): రాయలసీమ యూనివర్సిటీలోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఉపకులపతి ఎ.ఆనందరావు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ మధు సూదన్‌ వర్మ, రెక్టార్‌ సంజీవరావు పాల్గొన్నారు.  

- కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్‌ 65వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి నగర కాంగ్రెస్‌ అధ్య క్షుడు జాన్‌  విల్సన్‌ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, అశోకరత్నం, బి.రాకేష్‌, ఖాజాహుసేన్‌, నర్సింగారావు, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

కల్లూరు: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బీ ఆర్‌ అంబేడ్కర్‌ అని కాంగ్రెస్‌ పార్టీ నంద్యాల పార్లమెం టు జిల్లా డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్‌ అన్నారు. నంద్యాల చెక్‌పోస్టు వద్ద పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు.

కర్నూలు (కల్చరల్‌): అంబేడ్కర్‌ ఆశయాల దిశగా అన్ని వర్గాల ప్రజలు ఎదగాలని రోజా మహిళా ఐక్య సంఘం కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌ మీసాల సుమలత అన్నారు. రోజా వీధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పుష్పమాలలు వేశారు. 

పత్తికొండ: అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఓటీఎస్‌ విధానానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. సోమవారం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అశోక్‌కుమార్‌, లోక్‌నాథ్‌. తిమ్మయ్య చౌదరి, రవీంద్రనాథ్‌చౌదరి, కాకర్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

కల్లూరు: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను సాధిం చేందుకు కృషి చేయాలని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి అన్నారు. 33వ వార్డులోని ఇందిరమ్మకట్ట సర్కిల్‌లోని అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Updated Date - 2021-12-07T05:36:58+05:30 IST