పోలీసు అమరవీరుల కుటుంబాలకు చేయూత

ABN , First Publish Date - 2021-10-28T05:31:38+05:30 IST

పోలీసు అమరవీరుల కుటుంబాలకు మ్యాన్‌ కైండ్‌ ఫార్మా సంస్థ తమ వంతు ఆర్థిక సాయాన్ని అందించింది.

పోలీసు అమరవీరుల కుటుంబాలకు చేయూత
ఆర్థిక సాయం చెక్కును అందజేస్తున్న ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి

కర్నూలు, అక్టోబరు 27: పోలీసు అమరవీరుల కుటుంబాలకు మ్యాన్‌ కైండ్‌ ఫార్మా సంస్థ తమ వంతు ఆర్థిక సాయాన్ని అందించింది. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలో భాగంగా ఒక్కో పోలీసు కుటుం బానికి రూ.3 లక్షల చెక్కును రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎం.సుచరిత, రాష్ట్ర డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ చేతుల మీదుగా విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అందించారు. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాల యూనిట్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించా రు. స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌ కుమార్‌రెడ్డి ఈ కాన్ఫ రెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌లో మ్యాన్‌ కైండ్‌ ఫార్మసీ సంస్థ ఆర్థిక సాయంగా అందజేసిన చెక్కులను మృతి చెం దిన హోంగార్డుల కుటుంబాలకు ఎస్పీ అందిం చారు. హోంగార్డు యూనిట్‌లో ఉమెన్‌ హోం గార్డుగా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరమ్మ ఏప్రిల్‌ 26న కరోనా బారిన పడి మృతి చెందిం ది. ఈమె కుమార్తె కె.శీరిషకు రూ.3 లక్షల చెక్కును, అలాగే హోంగార్డు రమీజుల్లాబేగ్‌ మే 11న కరోనా బారిన పడి మృతి చెందాడు. ఈ యన భార్య షేక్‌ ఫరీదాబేగంకు రూ.3 లక్షల చెక్కును ఎస్పీ అందజేశారు. వీడియో కాన్ఫరె న్స్‌లో ఎస్పీతో పాటు హోంగార్డు కమాండెంట్‌ రామ్మోహన్‌, డీఎస్పీలు రమణ, రవీంద్రారెడ్డి, ఏవో సురేష్‌బాబు, మ్యాన్‌ కైండ్‌ ఫార్మాసీ ఇన్‌ చార్జి పూర్ణచందర్‌, హోంగార్డు సంఘం అధ్యక్షు డు విజయరత్నం పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:31:38+05:30 IST