అవినీతిని నిర్మూలిద్దాం: ఏసీబీ డీఎస్పీ

ABN , First Publish Date - 2021-10-30T04:57:51+05:30 IST

దేశంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించి ఆదర్శంగా నిలుద్దామని కర్నూలు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ సూచించారు.

అవినీతిని నిర్మూలిద్దాం: ఏసీబీ డీఎస్పీ

ఓర్వకల్లు, అక్టోబరు 29: దేశంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించి ఆదర్శంగా నిలుద్దామని కర్నూలు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ సూచించారు. విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల్లో భాగంగా కర్నూలు పవర్‌ గ్రిడ్‌ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విజిలెన్స్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శివనారాయణ మాట్లాడుతూ నేటి సమాజంలో చాలా మంది ఏదో ఒక సందర్భంలో అవినీతి బారిన పడిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, దీనిని అంతం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్‌ 2019లో గుంటూరులో 14400 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రారంభించారన్నారు. విద్యార్థులు ఈ దశ నుంచే అవినీతిని ప్రశ్నిం చే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మీ ప్రాంతంలో ఎక్కడైనా అవినీతి జరుగుతున్నట్లు తెలిస్తే.. వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇస్తే.. ఏసీబీ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో అవినీతి నిర్మూలన అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, గెలు పొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం లో ఏసీబీ సీఐ ఇంతియాజ్‌, ఏసీబీ ఎస్‌ఐ వెంకటరెడ్డి, ఓర్వకల్లు ఎస్‌ఐ మల్లికార్జున, పవర్‌గ్రిడ్‌ సీజీఎం రమేషన్‌, డీజీఎం ప్రకాష్‌, డీఎం సూర్య ప్రకాష్‌ ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, పోలీసు, పవర్‌ గ్రిడ్‌ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-30T04:57:51+05:30 IST