లారీ బోల్తా

ABN , First Publish Date - 2021-08-22T05:16:16+05:30 IST

మండలంలోని 40వ నెంబరు జాతీయ రహదారిపై శ్రీనివాస డెయిరీ సమీపంలో శనివారం కలప లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది.

లారీ బోల్తా

పాణ్యం, ఆగస్టు 21: మండలంలోని 40వ నెంబరు జాతీయ రహదారిపై శ్రీనివాస డెయిరీ సమీపంలో శనివారం కలప లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం సంగం నుంచి మహారాష్ట్రలోని పూనేకు కలప లోడుతో వెళ్తున్న ఎంహెచ్‌ 24 ఏయూ 2147 నెంబరుగల లారీ శ్రీనివాస డెయిరీ వద్ద అదుపు తప్పి  బోల్తా పడినట్లు లారీ డ్రైవర్‌ తెలిపారు. కాగా ఇరవై రోజులుగా నెరవాడ మెట్ట నుంచి పాణ్యం డొంగు వరకు ఏర్పాటు చేసిన వన్‌వే మార్గమే కారణమని స్థానికులు తెలిపారు. ఎదురుగా వస్తున్న భారీ వాహనాన్ని తప్పించబోయి పక్కకు వెళ్లడంతో ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. స్థానిక హైవే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.Updated Date - 2021-08-22T05:16:16+05:30 IST