రేపటి నుంచి భాషా వేడుకలు
ABN , First Publish Date - 2021-12-26T05:54:09+05:30 IST
పాఠశాలల్లో ఈ నెల 27వ తేదీ నుంచి 30 వరకు లాంగ్వేజ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డా.వేణుగోపాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(ఎడ్యుకేషన), డిసెంబరు 25: పాఠశాలల్లో ఈ నెల 27వ తేదీ నుంచి 30 వరకు లాంగ్వేజ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డా.వేణుగోపాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు, ఎంఐఎస్‌సీవో, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్స్‌కు, సీఆర్‌పీలకు అన్ని యాజమాన్యాల ఉన్నత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 27వ తేదీన ఇంగ్లీషు, 28న హిందీ, 29న సుగాలి, 30న తెలుగు భాషా వేడుకలు నిర్వహించాలన్నారు.
చదివించే పోటీలు (5 లేదా 7 నిమిషాల్లో చదవగలిగే చిన్న కథలు), చిన్న కథల రచన. భాష ప్రాముఖ్యతపై ప్రసంగం, డ్రామాటైజ్డ్ స్టోరీ టెల్లింగ్, రైమ్స్, పద్యాలు, షాయరీ, గజల్స్, స్పెల్లింగ్ గేమ్‌లు, స్థానిక వనరుల వినియోగంతో టీఎల్‌ఎం తయారీ, డంబ్‌షార్డ్స్, వర్డ్ బిల్డింగ్ లేదా అంత్యాక్షరి, గానం, నృత్యం వంటి ప్రదర్శనలు నిర్వహించాలన్నారు.