కర్నూలు జిల్లాలో ఈ మున్సిపాలిటీలన్నీ వైసీపీవే..

ABN , First Publish Date - 2021-03-14T19:08:00+05:30 IST

కర్నూలు జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో..

కర్నూలు జిల్లాలో ఈ మున్సిపాలిటీలన్నీ వైసీపీవే..

కర్నూలు: కర్నూలు జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ దూసుకెళ్తోంది. కర్నూలు జిల్లాలో ఒక కార్పొరేషన్‌, 7 మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. ఈ తొమ్మిదింటిలో ఆరు మున్పిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. అన్నింటిలోనూ వైసీపీ గెలిచింది. 


వైసీపీ గెలిచినవి: ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు, డోన్

కర్నూలు కార్పొరేషన్, నంద్యాల మున్సిపాలిటీలలో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

Updated Date - 2021-03-14T19:08:00+05:30 IST