ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో..

ABN , First Publish Date - 2021-05-21T05:00:35+05:30 IST

క్షేత్రస్థాయిలో జిల్లాలో పని చేస్తున్న కలెక్టర్లు, అధికారులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కొవిడ్‌-19 కట్టడి చర్యలపై న్యూఢిల్లీ నుంచి గురువారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో..

కర్నూలు(కలెక్టరేట్‌), మే 20:  క్షేత్రస్థాయిలో జిల్లాలో పని చేస్తున్న కలెక్టర్లు, అధికారులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కొవిడ్‌-19 కట్టడి చర్యలపై న్యూఢిల్లీ నుంచి గురువారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఇన్‌చార్జి కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, డీఎంహెచ్‌వో డా.రామగిడ్డయ్య, ఎన్‌ఐసీ డీఐవో అరుణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ కరోనా కారణంగా అందరిపై మరింత బాధ్యత, సవాళ్లు పెరిగాయనీ, ఈ సరికొత్త సవాళ్ల మధ్య మనం కొత్త వ్యూహాలు, పరిష్కారాలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని దిశా నిర్దేశం చేశారు. స్థానిక అనుభవాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ఒక దేశంగా అంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వైరస్‌పై పోరాటంలో ఆయా జిల్లాల యంత్రాంగం ఫీల్డ్‌ కమాండర్లుగా వ్యవహరించడం ప్రశంసనీయమన్నారు. ప్రతి జిల్లాకు వేర్వేరు సవాళ్లు ఉంటాయని, జిల్లాలో ఎదురవుతున్న సవాళ్లు అధికార యంత్రాంగానికే బాగా తెలుస్తాయన్నారు. అంతకుముందు కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాల కలెక్టర్లతో ఆయన జిల్లాలో చేపడుతున్న కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సుదీర్ఘంగా సమీక్షించారు.  కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై అధికారులు తీసుకుంటున్న చర్యలు సహా వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2021-05-21T05:00:35+05:30 IST