కర్నూలు జిల్లా: సచివాలయ భవనం నిర్మాణంపై హైకోర్టు సీరియస్

ABN , First Publish Date - 2021-08-10T20:32:45+05:30 IST

కర్నూలు జిల్లా జి.సింగవరం నీటిపారుదల శాఖ స్థలంలో..సచివాలయ భవనం నిర్మాణంపై హైకోర్టు సీరియస్ అయింది.

కర్నూలు జిల్లా: సచివాలయ భవనం నిర్మాణంపై హైకోర్టు సీరియస్

అమరావతి: కర్నూలు జిల్లా జి.సింగవరం నీటిపారుదల శాఖ స్థలంలో..సచివాలయ భవనం నిర్మాణంపై హైకోర్టు సీరియస్ అయింది. తక్షణమే భవన నిర్మాణాన్ని ఆపేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సర్పంచ్ నాగేంద్ర సచివాలయ భవన నిర్మాణంపై హైకోర్టును ఆశ్రయించారు. భవనాన్ని గ్రామంలో నిర్మించాలని అడిగినా ఊరికి దూరంగా.. సచివాలయం కట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు.


భవన నిర్మాణం కోసం కాంట్రాక్టర్‌కు రూ.9 లక్షలు చెల్లించాలని..సర్పంచ్‌కు పంచాయతీ కార్యదర్శి నోటీసులపై నాగేంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి సర్పంచ్‌కి నోటీసులు ఎలా ఇస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నోటీసులను నిలిపివేసింది. సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా గెలవడంతో అధికార పార్టీ సభ్యులు వేధిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది యలమంజుల బాలాజీ కోర్టుకు తెలిపారు.

Updated Date - 2021-08-10T20:32:45+05:30 IST